భూవివాదం: గిరిజన రైతు మృతి | Tribal Farmers Died in West Godavari Over Land Dispute | Sakshi
Sakshi News home page

భూవివాదం: గిరిజన రైతు మృతి

Nov 9 2019 5:39 PM | Updated on Nov 9 2019 6:24 PM

Tribal Farmers Died in West Godavari Over Land Dispute - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం సూరప్పవారంగూడెలో ఓ భూవివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం తన పొలంలో దుక్కి దున్నుకుంటున్న గిరిజన రైతు దాది గోవింద్‌పై గిరిజనేతర రైతులు దాడి చేశారు. దీంతో వారి దాడిలో గిరిజనరైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ రైతును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాది గోవింద్‌ హత్యకు నిరసనగా సీపీఐ ఎం.ఎల్‌ న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించారు. హత్యకు బాధ్యులైన గిరిజనేతర రైతులను వెంటనే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement