
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ పాతగవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లేదారిలో ఏలూరు లాకుల సమీపంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఆటోపై చెట్టు విరిగిపడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఏలూరు కాల్వగట్టు పొడవునా పెద్ద చెట్లు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో ఆటో, రిక్షా వాలాలు చెట్లకిం ద వాహనాలు నిలిపి సేదతీరు తూ ఉంటా రు. ఎప్పటిలాగే ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను పార్క్ చేసి పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కాల్వగట్టుపై ఉన్న జామాయిల్ చెట్టు విరిగి ఆటోపై పడింది, ఈ ఘటనలో ఆటో పై భాగం దెబ్బతింది. చెట్టు విరిగిపడిన సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత సమయం తరువాత చెట్టును తొలగించి ఆటోను అక్కడి నుంచి తరలించారు.