నో లైన్‌... నో ప్లేస్‌ ! | Trains Stable With No Space in YSR kadapa | Sakshi
Sakshi News home page

నో లైన్‌... నో ప్లేస్‌ !

Dec 29 2018 1:46 PM | Updated on Dec 29 2018 1:46 PM

Trains Stable With No Space in YSR kadapa - Sakshi

తిరుపతిలో లైన్‌ లేక నందలూరు రైల్వేకేంద్రంలో స్టేబుల్‌ అయిన కశ్మీర్‌ రైలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : రేణిగుంట రైల్వే జంక్షన్, తిరుపతి రైల్వేస్టేషన్లలో రైళ్ల రద్దీ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఆ రైలు గమ్యాలకు చేరిన తర్వాత వాటిని నిలపడానికి లైన్ల కొరత పీడిస్తోంది. ఫలితంగా రేణిగుంట, తిరుపతి లైన్లు ఖాళీ లేకపోవడంతో ఆ రైళ్ల ఫార్మిసిన్లను జిల్లాలోని నందలూరు, రైల్వేకోడూరు స్టేషన్లలో స్టేబుల్‌ చేస్తున్నారు. ఒకేసారి రెండు నుంచి మూడు రైళ్ల ఫార్మిసన్లను పెట్టుకోలేని పరిస్థితిలో వాటిని జిల్లాకు తరలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బైవీక్లీ, యాత్రస్పెషల్స్‌ రైళ్లతోపాటు మరికొన్ని దూర ప్రాంతరైళ్లు ఉన్నాయి.

పలుచోట్ల పలురైళ్ల స్టేబుల్‌
జిల్లా రైలుమార్గంలో బోగీల ఫార్మిసన్‌ను తీసుకొచ్చి నందలూరు వరకు ఏ స్టేషన్‌లో లైను ఖాళీగా ఉంటే అక్కడ నిలుపుతున్నారు. ఫలితంగా ఇక్కడ రైల్వేస్టేషన్లలో అధికంగా గూడ్స్‌రైళ్లు వచ్చినప్పుడు లైన్‌ ఖాళీ లేక రైల్వే అధికారులు వాటి రాకపోకలను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో రైల్వేపరంగా నందలూరు రైల్వేకేంద్రంలో యార్డులైన్లు ఉండడం వల్లన రేణిగుంట, తిరుపతిలో నిలుపుకోలేని రైళ్లను ఇక్కడి తీసుకొచ్చి పెడుతున్నారు. అయితే నిత్యం 25కిపైగా గూడ్స్‌రైళ్లు నందలూరులో క్రూ(డ్రైవర్లు, గార్డులు మార్పు) ప్రక్రియ ఉన్నందువల్ల వాటి తాకిడి అధికంగా ఉంటుంది. ఈ కేంద్రంలో ఇటు పలు రైళ్లు ఫార్మసిన్లు, మరోవైపు గూడ్స్‌రైళ్ల రద్దీతో నందలూరు రైల్వేకేంద్రంలో రద్దీ కనిపిస్తోంది.

 పొడిగిస్తే పోలా..!
పుణ్యక్షేత్రమైన తిరుపతి, జంక్షన్‌ కేంద్రమైన రేణిగుంట రైల్వేకేంద్రంలో వచ్చిన రైళ్లను నిలుపుకోలేని పరిస్థితిలో వాటిని జిల్లా వరకూ పొడిగిస్తే పోలా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలుతోపాటు విజయవాడ, చెన్నై, కేరళ తదితర ప్రాంతాలకు నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రోజుల తరబడి స్టేబుల్‌ చేసుకునేందుకు రైల్వే యంత్రాంగం నానాకష్టాలు పడుతున్న క్రమంలో జిల్లా వైపు పొడిగింపు దిశగా నడిస్తే జిల్లాలోని రైలుమార్గంలో మరికొన్ని రైళ్ల రాకపోకలు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయని కోరుతున్నారు. గతంలో కూడా రాజధానికి తిరుపతి, రేణిగుంట మీదుగా నడిచే పలు రైళ్లకు రోజుల వ్యవధి స్టేబుల్‌ కావాల్సిన పరిస్థితులు ఉంటే వాటిని జిల్లా కేంద్రవరకు అయినా పొడిగించాలని ఉన్నతాధికారులకు ఈ ప్రాంతం నుంచి వినతులు వెళ్లాయి.

పట్టించుకోని రైల్వే..
జిల్లాకు తిరుపతి, రేణిగుంటలో ఖాళీగా ఉన్న రైళ్లను పొడిగించాలని అనేక మార్లు రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఉన్నతాధికారుల వరకు చేసిన విన్నపాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. జిల్లా కేంద్రం కడప, నందలూరు నుంచి గతంలో అటు చెన్నై, తిరుపతి, అటు గుంతకల్, రాయచూరు వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. ఇప్పుడు కనీసం రాష్ట్ర రాజధాని వరకు అయినా ఒక పొడిగింపు రైలును రైల్వేబోర్డు మంజూరు చేయడంలేదు. కొత్త రైళ్లు రాకపోయినా.. పొడిగింపురైళ్లను అయినా జిల్లా రైలుమార్గంలో నడిపిస్తే జిల్లావాసులకు మార్గం సుగుమం అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement