ట్రాఫిక్ టైర్..! | Traffic tire | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ టైర్..!

Aug 15 2014 1:59 AM | Updated on Sep 2 2018 4:48 PM

సిక్కోలు వాసులను గురువారం ట్రాఫిక్ ఠారెత్తించింది. ఉదయం నుంచి పట్టణంలో జరిగే వివాహాలకు పెద్దఎత్తున హాజరైన జనంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. దీనికి తోడు మధ్యాహ్నం

 సిక్కోలు వాసులను గురువారం ట్రాఫిక్ ఠారెత్తించింది. ఉదయం నుంచి పట్టణంలో జరిగే వివాహాలకు పెద్దఎత్తున హాజరైన జనంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. దీనికి తోడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంత్రి వాహనం వస్తుందని రాకపోకలు నిలిపివేయడం, అనంతరం గంట సమయం పాటు  కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొత్తబ్రిడ్జి రోడ్డు, పాలకొండ రోడ్డు, ఫారెస్టు ఆఫీస్ రోడ్లు వాహనదారులతో నిండిపోయాయి. పట్టణం దాటేందుకు గంటల తరబడి సమయం పట్టింది. వాహనచోదకులు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. -ఫొటోలు: సాక్షిఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement