ఎమ్మెల్యే కొడుకు ట్రాక్టర్ సీజ్ | tractor seize in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొడుకు ట్రాక్టర్ సీజ్

Published Tue, Apr 7 2015 8:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

tractor seize in vijayanagaram distirict

పూసపాటిరేగ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసన సభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడు తమ్మునాయుడుకు చెందిన ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకొన్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చంపావతినది నుంచి అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎమ్మెల్యే నారాయణస్వామి స్వగ్రామైన చల్లవానితోట, రెల్లివలస పంచాయతీల్లో అనుమతి లేకుండా 90 స్టాక్ పాయింట్లులో ఉన్న 160 ట్రాక్టర్ల ఇసుకను గత మూడు రోజుల్లో సీజ్ చేసి డెంకాడ రీచ్‌కు అప్పగించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement