ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి | tractor rolls and two died | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి

May 24 2015 3:28 PM | Updated on Aug 25 2018 6:06 PM

ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టి కాల్వలో పడిపోయింది.

తూర్పు గోదావరి: ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టి కాల్వలో పడిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఈ ఘటన తూర్ప గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని ఎ.వి నగరంలో బొడ్డు సత్యనారాయణ అనే వ్యక్తి పొలం పనులు పూర్తి చేసుకుని ట్రాక్టర్‌పై ఇంటికి  వస్తుండగా వాహనం అదుపు తప్పి పంట కాల్వలో పడిపోయింది. దీంతో సత్యానారయణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ట్రాక్టర్ లో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలొదిలాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(తొండంగి)

Advertisement
 
Advertisement
Advertisement