మన్యం పరిస్థితిపై ఆరా | Tracks on the situation manyam | Sakshi
Sakshi News home page

మన్యం పరిస్థితిపై ఆరా

Nov 6 2015 11:17 PM | Updated on Sep 3 2017 12:08 PM

సీఆర్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఎం.విష్ణువర్ధనరావు, ఒడి శా ఐజీ పియూష్ ఆనంద్‌లు శుక్రవారం మన్యంలో పర్యటించి ......

అల్లిపురం:  సీఆర్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఎం.విష్ణువర్ధనరావు, ఒడి శా ఐజీ పియూష్ ఆనంద్‌లు శుక్రవారం మన్యంలో పర్యటించి   ఏరియల్ సర్వే చేపట్టినట్లు తెలిసింది. ముంచంగిపుట్టులో పాఠశాల విద్యార్థులతో మాట్లాడాక సీఆర్పీఎఫ్ శిబిరాలను సందర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఏపీఎండీసీకీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఐజీల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏజెన్సీ పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న వారిని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం. ఈ సందర్బంగా మన్యంలో తాజా పరిస్థితిపై సమీక్షించినట్లు తెలిసింది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement