రేపు ఏర్పేడు బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | tomorrow, ys jagan mohan reddy to condolence Erpedu victims | Sakshi
Sakshi News home page

రేపు ఏర్పేడు బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Apr 22 2017 4:57 PM | Updated on Jul 25 2018 4:42 PM

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం తిరుపతి వెళ్లనున్నారు.

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం తిరుపతి వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శిస్తారు.

ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 15 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement