రాజీవ్ యువ కిరణాల్లో భాగంగా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుల నియామకానికి సంబంధించిన ఎంపికలు శుక్రవారం చేపడుతున్నట్టు డీఆర్‌డీఏ పీడీ పి.రజనీకాంతరావు తెలిపారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాజీవ్ యువ కిరణాల్లో భాగంగా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుల నియామకానికి సంబంధించిన ఎంపికలు శుక్రవారం చేపడుతున్నట్టు డీఆర్‌డీఏ పీడీ పి.రజనీకాంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
పదో తరగతి ఉత్తీర్ణులై, 168 సెంటీమీటర్ల ఎత్తు, 50 కేజీల బరువు కలిగి, 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుషు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు. రేషన్‌కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, బయోడేటా తీసుకురావాలని స్పష్టం చేశారు.