రేపే ‘రంజాన్’ | Tomorrow 'Ramadan' | Sakshi
Sakshi News home page

రేపే ‘రంజాన్’

Jul 6 2016 3:32 AM | Updated on Oct 16 2018 6:01 PM

రేపే ‘రంజాన్’ - Sakshi

రేపే ‘రంజాన్’

ముస్లింలు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్నారు.

మదనపల్లె సిటీః  ముస్లింలు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్నారు.  ప్రభుత్వ జిల్లా సర్‌ఖాజీ  కమాలుల్లాషాజహురీ, మతగురువులు మౌల్వీ షాకీరుల్లా సాహెబ్ లతీఫీ, హాఫీజ్ సైపుల్లా సాహెబ్ ఈమేరకు  ప్రకటించారు. మంగళవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనం కానందున ఈద్ పండుగను గురువారం జరుపుకోవాలన్నారు. 


హిలాల్ కమిటీ మదనపల్లె జామియా మసీదులో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిలాల్ కమిటీలతో సంప్రదింపులు జరిపి ఎక్కడా నెలవంక దర్శనం కాలేదని నిర్థారించుకున్నాక ఈ మేరకు ప్రకటించారు. గురువారం ఉదయం ముస్లిం సోదరులందరూ ఈద్గాలలో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.  జకాత్,ఫిత్రాలు ఇది వరకు  చెల్లించనివారు వెంటనే పేదలకు చెల్లించి వారు కూడా పండుగ సంతోషంగా జరుపుకునేలా చూడాలన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement