రేపు షార్‌కు ప్రధాని మోడీ | tomorrow narendra modi is coming to sar | Sakshi
Sakshi News home page

రేపు షార్‌కు ప్రధాని మోడీ

Jun 28 2014 3:10 AM | Updated on Aug 15 2018 2:20 PM

రేపు షార్‌కు ప్రధాని మోడీ - Sakshi

రేపు షార్‌కు ప్రధాని మోడీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌కు చేరుకోనున్నారు.

 శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌కు చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడికి రానున్నారు.

ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి వచ్చే మోడీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4.30 గంటలకు షార్‌కు వస్తారు. గవ ర్నర్, సీఎం మాత్రం ఓ గంట ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది పోలీసులు, 30 మంది ఎస్‌పీజీ కమాండోలు షార్‌కు చేరుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement