నేడు షర్మిల ఎన్నికల ప్రచారం | today ys sharmila YSR Janabheri | Sakshi
Sakshi News home page

నేడు షర్మిల ఎన్నికల ప్రచారం

Apr 27 2014 3:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేడు షర్మిల ఎన్నికల ప్రచారం - Sakshi

నేడు షర్మిల ఎన్నికల ప్రచారం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమ, మంగళవారాల్లో జిల్లాలో ఎ న్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

  •      ఉత్సాహంగా వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు
  •      ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
  •      నేడు తంబళ్లపల్లె, కుప్పం, పలమనేరు, పూతలపట్టుల్లో సభలు
  •      రేపు ఉదయం శ్రీకాళహస్తిలో బహిరంగసభ
  •  సాక్షి, చిత్తూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమ, మంగళవారాల్లో జిల్లాలో ఎ న్నికల ప్రచారం నిర్వహించనున్నా రు. వైఎస్‌ఆర్ సీపీ రాజంపేట, తిరుపతి, చిత్తూరు ఎంపీ అభ్యర్థులను, 14 నియోజకవర్గాల్లో ని ఎమ్మెల్యే అభ్యర్థుల విజ యం కోసం ఆమె రెండురోజుల పాటు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచార పర్యటన నిర్వహించనున్నారు. 27న ఉదయం 9.30 గంటలకు  ములకలచెరువులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

    తంబళపల్లెలో 10.30గంటలకు, కుప్పం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3.30గంటలకు ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. పలమనేరు నియోజకవర్గం వి.కోటలో 5 గంటలకు ప్రచార సభలో పాల్గొంటారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో సాయంత్రం 6.30 గంటలకు సభలో పాల్గొంటా రు. 28న ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో నిర్వహించే ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఈ సభల ఏర్పాట్లను ఉత్సాహంగా పర్యవేక్షిస్తున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement