నేడు జిల్లాకు జగన్ రాక | Today, the arrival of the ys Jagan in district | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు జగన్ రాక

Feb 27 2015 1:33 AM | Updated on Aug 9 2018 4:43 PM

నేడు జిల్లాకు జగన్ రాక - Sakshi

నేడు జిల్లాకు జగన్ రాక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు.

తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు.

తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్‌కు బయలు దేరుతారని ఆయన వివరించారు. విమానాశ్రయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అధినేతకు స్వాగతం పలికేందుకు తరలివచ్చే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement