ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 12th TSRTC JAC Calls For Telangana Bandh on 19th | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 12 2019 6:43 PM | Updated on Oct 12 2019 7:19 PM

Today Telugu News Oct 12th TSRTC JAC Calls For Telangana Bandh on 19th - Sakshi

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన పర్యటన ముగించుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి అతడిని సాగనంపారు. మోదీ-జిన్‌పింగ్‌ అనధికార శిఖరాగ్ర భేటీలో కశ్మీర్‌ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్‌ భవన్‌ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement