ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్ | Today Minister Narayan nomination as MLC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్

Aug 11 2014 2:43 AM | Updated on Oct 2 2018 2:53 PM

ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్ - Sakshi

ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో నారాయణ ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందించనున్నారు.

కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది.  ఆదివారం వరకూ ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ  ఉంది.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement