వడ్డీకాసులవాడికి వందల కోట్ల వడ్డీ ఆదాయం

Tirumala temple : Annual interest income is Rs 766 crore - Sakshi

తిరుమల శ్రీవారి బ్యాంకు డిపాజిట్లు రూ. 7 వేల కోట్లు

వాటిపై ఏటా వచ్చే వడ్డీ ఆదాయం రూ.766 కోట్లు

ఏపీ శాసనమండలి హామీల అమలు కమిటీకి టీటీడీ నివేదిక

రోజుకు రెండున్నర నుంచి రూ. 3 కోట్ల ఆదాయం

సాక్షి, అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఏటా వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 766 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏపీ శాసనమండలి హామీల అమలు కమిటీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.

శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. భక్తులు దర్శన టికెట్‌ కొనుగోళ్ల ద్వారా టీటీడీకి రెండేళ్ల క్రితం రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది దర్శన టికెట్ల ద్వారా రూ. 256 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీ వార్షిక ఆదాయం రూ. 2,858 కోట్లు. భక్తులు హుండీలో వేసే కానుకల ద్వారా రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇతర కానుకల ద్వారా ఈ ఏడాది రూ. 1,110 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీకి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాగా ఉంది. స్వామి పూజా సామగ్రి, తదితర వస్తువుల కొనుగోలుకు మూడు నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top