5న శ్రీరామనవమి ఆస్థానం | Tirumala: sri rama navami asthanam starts from 5th April | Sakshi
Sakshi News home page

5న శ్రీరామనవమి ఆస్థానం

Apr 2 2017 5:49 AM | Updated on Nov 6 2018 5:52 PM

5న శ్రీరామనవమి ఆస్థానం - Sakshi

5న శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 5న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు.

8 నుంచి వార్షిక వసంతోత్సవాలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 5న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీరామచంద్ర మూర్తి రూపంలో ఆంజనేయునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఇక 6న రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించ నున్నారు. తిరుమల ఆలయంలో ఈ నెల 8 నుంచి 10 వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం, ఇతర శాస్త్రోక్తంగా పూజల నిర్వహించనున్నారు. 9వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. ఇక 10వ తేదీ స్నపన తిరుమంజనంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, సీతారామ లక్ష్మణ, ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ఇందులో భాగంగా ఈ మూడు రోజులూ కల్యా ణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. రెండో రోజు సహస్రకళశాభిషేకం, మూడో రోజు తిరుప్పావడసేవ కూడా రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement