శ్రీశైలవాసు హత్యకేసులో ముగ్గురి అరెస్ట్ | Three arrested in ysrcp leader srisaila vasu murder case | Sakshi
Sakshi News home page

శ్రీశైలవాసు హత్యకేసులో ముగ్గురి అరెస్ట్

Nov 3 2014 11:39 AM | Updated on Sep 2 2017 3:49 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గవరపు శ్రీశైల వాసు హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నందిగామ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గవరపు శ్రీశైల వాసు హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలవాసు ను చందాపురం గ్రామానికి చెందిన ఉన్నం హనుమంతరావు, హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుడు పాషా గత నెల 28న హతమార్చిన విషయం తెలిసిందే. నందిగామ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు అయ్యింది.

నందిగామతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది నాలుగు బృందాలుగా ఆరు రోజుల నుంచి నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.  శనివారం అర్థరాత్రి కిరాయి హంతకుడు పాషాను నందిగామ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే హనుమంతరావును బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు పాషాకు తుపాకీ అద్దెకిచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరిని సోమవారం నందిగామ కోర్టులో హాజరు పరచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement