'నాకు ప్రాణహాని ఉంది' | Threat my life ,says neethu agarwal | Sakshi
Sakshi News home page

'నాకు ప్రాణహాని ఉంది'

May 17 2015 1:56 PM | Updated on Aug 28 2018 4:30 PM

'నాకు ప్రాణహాని ఉంది' - Sakshi

'నాకు ప్రాణహాని ఉంది'

తనకు ప్రాణహాని ఉందని టాలీవుడ్ సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు.

కర్నూలు: తనకు ప్రాణహాని ఉందని టాలీవుడ్ సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. అందుకు కుట్ర జరుగుతుందన్నారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఏం జరిగిన మస్తాన్ వలీదే బాధ్యత అంటూ ఆమె కన్నీటి పర్యంతమైయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట మాట్లాడతూ కన్నీరు పెట్టుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి నీతూ అగర్వాల్‌కు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలనే షరతుతో జడ్జి బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement