
ఈ మాఫీ కూడా అనుమానమే
రూ.లక్ష కోట్లకుపైగా ఉన్న వ్యవసాయ, డ్వాక్రా రుణాలలో రూ.35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.
వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
విజయవాడ బ్యూరో: రూ.లక్ష కోట్లకుపైగా ఉన్న వ్యవసాయ, డ్వాక్రా రుణాలలో రూ.35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయం లో వ్యవసాయ, డ్వాక్రా రుణాలు కట్టొద్దని చెప్పి, ఇప్పుడు వాటిలో కొంత రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తామంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
రుణాలను రద్దు చేయడానికి ఇసుక, ఎర్రచందనం కలపను అమ్ముతామంటూ రైతులు, మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన తీరు చూస్తుంటే రుణమాఫీ అనుమానంగానే ఉందన్నారు. కోటయ్య కమిటీ లక్ష లోపు రుణాలు మాత్రమే రద్దు చేయాలని సూచించిందని చెబుతున్న చంద్రబాబు.. కోటయ్యను అడిగి హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు.