ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూసమీకరణలో ఎటువంటి ఆలస్యం జరగడం లేదని మంత్రి నారాయణ తెలిపారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూసమీకరణలో ఎటువంటి ఆలస్యం జరగడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. సుమారు 800 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం ద్వారా సేకరించాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మే 14 తర్వాత భూసమీకరణకు అంగీకరించని రైతుల భూములను చట్టం ద్వారా తీసుకుంటామన్నారు.
కొందరు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. భూసమీకరణపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
