గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దారికాచి దొంగతనానికి పాల్పడ్డారు.
సత్తెనపల్లి(గుంటూరు): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దారికాచి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ అడ్డరోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. నందిగామ అడ్డరోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి అటుగా వచ్చిన 10 వాహనాలను దోచుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ముగ్గురు బాధితులు పోలీసులను సంప్రదించారు. కాగా, నిందితులు ఆ దారిలో వచ్చిన వారిని అడ్డగించి కత్తి, గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.