చిత్తూరు జిల్లా కుప్పం మండల మండల కేంద్రంలో ఓ ఆలస్యంగా వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లా కుప్పం మండల మండల కేంద్రంలో ఓ ఆలస్యంగా వెలుగు చూసింది. శాంతిపురం మండల వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న మహబూబ్ .. కుప్పం హెచ్‌పీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుటుంబసమేతంగా బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం వారు ఇంటికి చేరుకోగా దొంగతనం విషయం తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి ప్రవేశించి ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదుతోపాటు 20 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.