ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు విడుదల | The release of the salaries of health workers | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు విడుదల

Nov 25 2013 2:59 AM | Updated on Sep 2 2017 12:57 AM

జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందికి కలెక్టర్ సిద్ధార్థజైన్ చొరవతో రూ.1.28 కోట్ల జీతాలు విడుదలయ్యాయి.

 ఏలూరు, న్యూస్‌లైన్ :  జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందికి కలెక్టర్ సిద్ధార్థజైన్ చొరవతో రూ.1.28 కోట్ల జీతాలు విడుదలయ్యాయి. ఏలూరు కలెక్టర్ బంగ్లాలో ఆదివారం కలెక్టర్ ఇం దుకు సంబంధించిన మూడు ఫైళ్లను పరిశీలించి జీతాల చెక్కులు విడుదల చేశారు.

నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో రెండో అంగన్‌వాడీ కార్యకర్తల ఇబ్బందులను గుర్తించిన ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.శకుంతలను పిలిచి సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఆదేశించారు. 539 మంది రెండో ఏఎన్‌ఎం కార్యకర్తలకు జూలై నుంచి అక్టోబరు వరకు జీతాల కింద రూ. 1.06 కోట్లు, 19 అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందికి జూలై నెల జీతాల కింద రూ. 12.77 లక్షల, ఆయుష్ శాఖకు చెందిన సిబ్బందికి జూలై నెల జీతాల కింద రూ. 6.62 లక్షలను జా తీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement