శ్రీకాళహస్తిలో బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు.
చిత్తూరు: శ్రీకాళహస్తిలో బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు బాలికల పెళ్లిని నిలిపివేశారు. వారికి సంబంధించిన పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్బంగా ఇక్కడ బాల్యవివాహాలు జరగడం చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉదయం శివపార్వతుల కళ్యాణం జరిగింది.
ఈ సందర్భంగా ఈ రోజు కూడా కొందరు బాల్యవివాహాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి వివాహాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.