ఉద్యాన శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ధ్వంసం | The office of the Department of Horticulture and destroy computer | Sakshi
Sakshi News home page

ఉద్యాన శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ధ్వంసం

Oct 2 2013 3:03 AM | Updated on Jun 1 2018 8:54 PM

సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడుతూ పలువురు సమైక్యవాదులు మంగళవారం స్థానిక ఉద్యానశాఖ ఏడీ-1 కార్యాలయంలో కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు.

 అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడుతూ పలువురు సమైక్యవాదులు  మంగళవారం స్థానిక ఉద్యానశాఖ ఏడీ-1 కార్యాలయంలో కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయాలు వెంటనే మూసివేయాలని ఉద్యాన శాఖతో పాటు ఏపీఎంఐపీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏడీ-1 కార్యాలయంలో సమైక్యవాదులు, సిబ్బంది మధ్య వాదోపవాదాలు శ్రుతి మించడంతో  ఆగ్రహించిన ఉద్యమకారులు ఒక కంప్యూటర్‌ను పగులగొట్టారు. దీంతో వెంటనే కార్యాలయాలకు తాళాలు వేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో లేకున్నా ఉద్యమ తీవ్రత నేపథ్యంలో విధులకు హాజరుకావడం లేదని ఆ శాఖ అధికారులు తెలిపారు.
 
 అయితే... అత్యవసర పనుల నిమిత్తం ఒకరిద్దరు కొంతసేపు ఉండి వెళుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సమైక్యవాదులు, అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో కూడా ఒకరిద్దరు పనిచేస్తుండగా సమైక్యవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి  గొడవపడిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement