ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ | The news on AP capital is not true:Union Home Ministry | Sakshi
Sakshi News home page

ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ

Aug 28 2014 8:47 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ - Sakshi

ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలుగా పేర్కొంటూ వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీః  ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలుగా పేర్కొంటూ వస్తున్న వార్తలు నిజం కాదని  కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.  ఇవన్నీ ఈ కమిటీ  గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలని ఆ వర్గాలు తెలిపాయి. శివరామకష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని ఆ వర్గాలు తెలిపాయి.

 అయితే  నివేదికను హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్  పరిశీలనకు  శుక్రవారం  ఆయన ముందు అధికారులు పెడతారని ఆ వర్గాలు వెల్లడించాయి. హోంమంత్రి పరిశీలన అయిన తరువాత అంటే శుక్రవారం గానీ, శనివారం గానీ  హోం శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయనున్నట్లు  ఆ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement