కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి | The new super-specialty hospital in the capital | Sakshi
Sakshi News home page

కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

Apr 3 2015 2:10 AM | Updated on Oct 17 2018 3:49 PM

కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి - Sakshi

కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

గుంటూరు, విజయవాడల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిని ఏర్పాటు...

  • కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
  • తిరుపతి, తిరుమల: గుంటూరు, విజయవాడల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరం, తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం దత్తాత్రేయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement