ప్రతిభను ప్రోత్సహించేవారే నాయకుడు | The leader of the talent promoters | Sakshi
Sakshi News home page

ప్రతిభను ప్రోత్సహించేవారే నాయకుడు

Feb 27 2015 1:38 AM | Updated on Oct 29 2018 8:24 PM

విద్యార్థుల్లో పోటీతత్త్వం పెంచి వారిని ఉన్నతస్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ....

వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానం
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెద్దిరెడ్డి ప్రశంసల జల్లు

 
చంద్రగిరి: విద్యార్థుల్లో పోటీతత్త్వం పెంచి వారిని ఉన్నతస్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిజమైన నాయకుడని  వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. చంద్రగిరి మండలంలో గత ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. చంద్రగిరి కొత్తపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని  సూచించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థి అభ్యున్నతే లక్ష్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు మీద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి పిల్లల భవిష్యత్‌కు తన వంతు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యను అందించే ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీలకతీతంగా సొంత నిధులతో  నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదట పాఠశాలలో ఒకరికి బంగారు పతకం, ఐదుగురికి వెండి పతకాలను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం విద్యావ్యవస్థల్లో మార్పు రావడంతో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులు అధికంగా ఉండడంతో రెండు బంగారు పతకాలను 24 వెండి పతకాాలను ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఘనంగా సత్కరించారు.   గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పతకాలను అందజేశారు. అనంతరం బి కొంగరవారి పల్లె, పనపాకం పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, ఎంపీడీవో డాక్టర్ వెంకటనారాయణ , మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి ,ఉపాధ్యాయ విభాగం అధ్యక్షుడు పార్లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా విభాగం మండల కన్వీనర్ వరలక్ష్మి, పాఠశాల కమిటీ చైర్మన్ మస్తాన్, పట్టణ కన్వీనర్ కొట్టాల చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దామినేటి కేశవులు, సింగల్‌విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఎంపీటీసీలు భారతి, నవనీత్మ, మురగయ్య, బుజ్జి, నాగరాజు, రామిరెడ్డి, నాయకులు బండారు హేమచంద్రారెడ్డి, ఒంటి శివశంకర్‌రెడ్డి, బొమ్మగుంట రవి, చిన్నియాదవ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement