బాపట్లలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సు డ్రైవర్ ఎన్.సురేంద్రనాథ్ మంగళవారం ఉదయం పూటుగా మద్యం తాగి..
బాపట్ల టౌన్: బాపట్లలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సు డ్రైవర్ ఎన్.సురేంద్రనాథ్ మంగళవారం ఉదయం పూటుగా మద్యం తాగి.. బస్సులో 20 మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్‌కు బయలుదేరాడు. మద్యం షాపులోంచి వస్తున్న సమయంలో డ్రైవర్‌ను గమనించిన మీడియా వీడియోతీసి దానిని గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడుకు వాట్సాప్ ద్వారా పంపింది. స్పందించిన ఎస్పీ డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలంటూ బాపట్ల పోలీసులను ఆదేశించారు.
డ్రైవర్‌ను పాఠశాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 206 మిల్లీ గ్రాములుగా చూపించింది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి డ్రైవర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.