breaking news
Narayana Institute of Education
-
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
లీకేజ్ నారాయణ ఎక్కడ ??
-
మద్యం మత్తులో డ్రైవర్.. గాల్లో చిన్నారుల ప్రాణాలు
బాపట్ల టౌన్: బాపట్లలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సు డ్రైవర్ ఎన్.సురేంద్రనాథ్ మంగళవారం ఉదయం పూటుగా మద్యం తాగి.. బస్సులో 20 మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్‌కు బయలుదేరాడు. మద్యం షాపులోంచి వస్తున్న సమయంలో డ్రైవర్‌ను గమనించిన మీడియా వీడియోతీసి దానిని గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడుకు వాట్సాప్ ద్వారా పంపింది. స్పందించిన ఎస్పీ డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలంటూ బాపట్ల పోలీసులను ఆదేశించారు. డ్రైవర్‌ను పాఠశాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 206 మిల్లీ గ్రాములుగా చూపించింది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి డ్రైవర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.