ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటి బిడ్డ మాయం | The disappearance of a newborns in government hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటి బిడ్డ మాయం

Nov 2 2015 11:29 AM | Updated on May 10 2018 12:34 PM

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ అదృశ్యమైన ఘటన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది.

 ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ అదృశ్యమైన ఘటన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరల్లోకి వెళితే.. ఏర్పేడు మండలం రావులవారి కండ్రిగ గ్రామానికి చెందిన గర్భిణి సుధ(23) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు ఆదివారం ఆడబిడ్డ పుట్టింది. కాగా.. సుధ నిద్రిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బిడ్డ అదృశ్యమైంది. అర్థరాత్రి లేచి చూసేసరికి పక్కన లేకపోవడంతో.. తల్లి ఆందోళన చెంది.. సిబ్బందికి తెలిపింది. విషయం తెలిసిన సుధ బంధువులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే పాప కనిపించకుండా పోయిందని.. ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement