ఉగ్రవాది అజాం ఘోరీ అనుచరుడు మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ను ఇంటర్పోల్ సాయంతో కువైట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు.
ఉగ్రవాది అజాం ఘోరీ అనుచరుడు మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ను ఇంటర్పోల్ సాయంతో కువైట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. ఇజాజ్ (35) స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2006లో అతను అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇండియన్ ముస్లిం మొహమ్మది ముజాహిద్దీన్ (ఐఎంఎంఎం)కి నిధుల సేకరణలో భాగంగా విజయవాడలో అతను ఓ వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐ ఏజెంట్గా భావిస్తున్న ఘోరీ.. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం ఐఎంఎంఎం స్థాపించాడు. కాగా నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణించాడు.