కర్నూలులో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత | Tension Prevails at RDS, over Karnataka to increase height of RDS Dam | Sakshi
Sakshi News home page

కర్నూలులో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత

Jul 22 2014 10:32 AM | Updated on Oct 1 2018 2:03 PM

రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు భారీగా మోహరించారు.

కర్నూలు : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు భారీగా మోహరించారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కుట్రపన్నడంతో ఇటీవల మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కోసిగి మండలం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సర్కార్ మరమ్మత్తు పనులకు సిద్ధం అవటంతో... కర్ణాటక తీరుపై కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

ఆర్డీఎస్ వద్ద  ఎలాంటి ఆధునికీకరణ పనులు చేపట్టకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలు గొడవలకు దిగకుండా ముందు జాగ్రత్తగా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కాపలా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement