breaking news
karnataka govenrment
-
‘వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. తప్పంతా మీదే’
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం తీరును కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తప్పుబట్టింది. ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం మేనేజ్మెంటే అని తేల్చిచెప్పింది. ఐపీఎల్లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు ఆర్సీబీ.తీరిన కలఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli). 2008 నుంచి ఇప్పటిదాకా అదే జట్టుతో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్. అయితే, పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఈసారి ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.తీవ్ర విషాదంఫ్రాంఛైజీ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అభిమానులకు పిలుపునివ్వడం విషాదకర ఘటనకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి ట్రోఫీతో బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికే క్రమంలో.. జూన్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా యాభై మంది గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చాయి.తప్పంతా మీదేఈ నేపథ్యంలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్‌పై వేటు పడింది. ఈ క్రమంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ వద్దకు విషయం చేరగా.. మంగళవారం విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యానిదే ఈ దుర్ఘటనకు బాధ్యత అని స్పష్టం చేసింది. వికాస్ కుమార్‌ను వెంటనే తన పదవిలో తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంది.ఈ మేరకు.. ‘‘ఆర్సీబీ పోలీసుల నుంచి సరైన రీతిలో అనుమతి తీసుకోలేదు. వారి నుంచి ఆమోదమూ పొందలేదు. అకస్మాత్తుగా.. విజయోత్సవం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనసమూహం చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకుంది.వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదుఅయితే, పన్నెండు గంటల్లోనే స్టేడియం వద్ద ఏర్పాట్లు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. నిజానికి వారికి మరింత సమయం ఇవ్వాల్సింది. పోలీసులు కూడా మనుషులే. వాళ్లేమీ దేవుళ్లో.. లేదంటే ఇంద్రజాలికులో కాదు.ఇలా అనుకోగానే.. అలా ఏర్పాట్లు చేయడానికి వారి వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదు’’ అంటూ ఆర్సీబీకి చివాట్లు పెట్టింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. అదే సమయంలో పోలీసుల పట్ల సహానుభూతి వ్యక్తం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత వివాదాలను క్యాట్ పరిష్యరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
ఓలాకు షాక్.. ఆరు నెలల నిషేధం
బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ 'ఓలా'కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకలో ఆరు నెలలు ఈ సంస్థ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రూల్స్‌ను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఓలా బైక్ ట్యాక్సీని నడుపుతుందని కర్ణాటక రవాణ శాఖ తెలిపింది. దీనిపై వివరణ కోరామని.. అయితే సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని వివరించింది. దీంతో కర్టాటక రవాణ చట్టం 2016 ప్రకారం ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 18వ తేదీనే ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును సరెండర్ చేయాలని కూడా ఓలా కంపెనీని ఆదేశించారు. దీంతో ఓలా క్యాబ్స్ కర్ణాటక రోడ్లపై ఆరు నెలలు కనిపించవని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
కర్నూలులో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు భారీగా మోహరించారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కుట్రపన్నడంతో ఇటీవల మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కోసిగి మండలం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సర్కార్ మరమ్మత్తు పనులకు సిద్ధం అవటంతో... కర్ణాటక తీరుపై కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ వద్ద ఎలాంటి ఆధునికీకరణ పనులు చేపట్టకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలు గొడవలకు దిగకుండా ముందు జాగ్రత్తగా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కాపలా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు.