breaking news
RDS Dam
-
ఆర్డీఎస్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన, ఉద్రిక్తం
కోస్గి: ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 200 మంది రైతులు ధర్నాకు తరలివచ్చారు. పనులను అడ్డుకునేందుకు యత్నించటంతో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కర్నూలులో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు భారీగా మోహరించారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కుట్రపన్నడంతో ఇటీవల మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కోసిగి మండలం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సర్కార్ మరమ్మత్తు పనులకు సిద్ధం అవటంతో... కర్ణాటక తీరుపై కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ వద్ద ఎలాంటి ఆధునికీకరణ పనులు చేపట్టకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలు గొడవలకు దిగకుండా ముందు జాగ్రత్తగా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కాపలా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు.