ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
కోస్గి: ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 200 మంది రైతులు ధర్నాకు తరలివచ్చారు. పనులను అడ్డుకునేందుకు యత్నించటంతో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.