కుకునూరులో ఉద్రిక్తత | tension prevailed at Kukunoor | Sakshi
Sakshi News home page

కుకునూరులో ఉద్రిక్తత

Sep 18 2014 1:53 PM | Updated on Sep 2 2017 1:35 PM

ఖమ్మం జిల్లా కుకునూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

కుకునూరు: ఖమ్మం జిల్లా కుకునూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ సహా ఎంపీ మాగంటి బాబు తొలిసారి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కుకునూరులో జరిగిన సమావేశంలో ఎంపీ మాగంటి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుచరుల ఆందోళనకు దిగారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై ఆంధ్ర అంటూ మాగంటి అనుచరులు నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా తాటి వెంకటేశ్వర్లు అనుచరులపై దాడికి యత్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement