మాన్యం భూముల కౌలు వేలంలో ఘర్షణ | tension in adusumalli at prakasam district over manyam lands lease | Sakshi
Sakshi News home page

మాన్యం భూముల కౌలు వేలంలో ఘర్షణ

May 30 2017 2:29 PM | Updated on Sep 5 2017 12:22 PM

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమిల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమిల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక గౌరీశంకర్‌ దేవస్థానానికి చెందిన (మాన్యం) భూముల కౌలుకు సంబంధించి వేలం వేసేందుకు దేవాదాయ శాఖాధికారులు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పాత కౌలుకు సంబంధించి లెక్కలు తేల్చిన తర్వాతే వేలం నిర్వహించాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement