ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత | tension at ITDA office | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

Oct 3 2015 1:13 PM | Updated on Aug 20 2018 5:08 PM

ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలక వర్గ సమావేశం కోసం ఐటీడీఏ కార్యాలయానికి కేంద్ర విమనయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు హాజరయ్యారు. ఆయనతో తమ సమస్యలు చెప్పుకుంటామంటూ.. గిరిజన విద్యార్థులు కార్యాలయానికి వచ్చారు. వీరిని లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు.

కార్యాలయంలోకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు వెనక్కి తగ్గక పోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

Advertisement
 
Advertisement
Advertisement