అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తుళ్లూరు(గుంటూరు): అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ శిలార్‌ఖాన్(28) అనే కౌలు రైతు ఇంటి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు.
సొంత పొలం లేకపోవడంతో గత ఏడాది 12 ఎకరాలు కౌలుకు తీసుకున్న శిలార్‌ఖాన్ పది ఎకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాడు. దిగుబడులు రాక సుమారు రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక తనలో తాను కుమిలిపోతూ చివరకు పురుగుమందు తాగి మృతి చెందినట్టు కుంటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.