మెడ్‌టెక్‌ జోన్‌ టెండర్లలో గోల్‌మాల్‌? | Sakshi
Sakshi News home page

మెడ్‌టెక్‌ జోన్‌ టెండర్లలో గోల్‌మాల్‌?

Published Wed, Aug 2 2017 3:32 PM

tenders scam in medtech zone

విశాఖపట్నం: మెడ్‌టెక్‌ జోన్‌ టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందని మెడ్‌టెక్‌ జోన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జుడీష్‌రాజు, రామరాజులు ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలను వారు మీడియాకు అందజేశారు. మౌలిక వసతుల కల్పన టెండర్లలో అవకతవకలు జరిగాయని, రూ.500 కోట్ల పనులకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలవగా ఎక్కడా లేని విధంగా 387 శాతం అధిక మొత్తానికి అంటే రూ.2,432 కోట్లకు టెండర్లను ల్యాంకో సంస్థకు ఖరారు చేశారని చెప్పారు.
 
అవినీతిపై ప్రశ్నించినందుకు జోన్‌ 8 మంది అధికారులను వైద్య ఆరోగ్య శాఖ తొలగించిందని తెలిపారు. ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సీఈఓ జితేంద్రశర్మ, కామినేని ఓఎస్డీ అంకం సోదరులపై వీరు ఆరోపణలు చేశారు. అలాగే 108 వాహనాల కాంట్రాక్టులోనూ అక్రమాలు జరిగాయని, 76 వాహనాలను ఇంట్రో మెడిక్స్‌కు అధిక మొత్తానికి అప్పగించారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement