మన్యంలో మంచు దుప్పటి  | Temperature Down in visakha agency | Sakshi
Sakshi News home page

మన్యంలో మంచు దుప్పటి 

Nov 4 2017 9:11 AM | Updated on Sep 19 2019 2:50 PM

మన్యం మంచు దుప్పటి కప్పుకుంది.

సాక్షి, విశాఖ: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, మినుమలూరు ప్రాంతాల్లో పది గంటలు దాటిన సూర్యుడు కనిపించకుండా తెల్లటి పొగమంచు కమ్మేసింది. శుక్రవారం రాత్రి మినమలూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement