అటు బ్రహ్మోత్సవం.. ఇటు దుర్గా పూజలు | telugu temples filled with dovotees | Sakshi
Sakshi News home page

అటు బ్రహ్మోత్సవం.. ఇటు దుర్గా పూజలు

Sep 30 2017 11:34 AM | Updated on Sep 30 2017 11:53 AM

 telugu temples filled with dovotees

సాక్షి, తిరుమల/ విజయవాడ : తిరుమలలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేత్రపర్వంగా స్వామివారి రథోత్సవం జరుగుతోంది. సాయంత్రం ఊంజల్‌ సేవ, రాత్రి అశ్వవాహన సేవ జరగనుంది. ఈ అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దయ్యాయి. దివ్యదర్శనంలో కూడా టోకెన్లను నిలిపేశారు. రేపు పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం జరగ నుంది. దీంతో రేపు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఘనంగా దుర్గా పూజలు
దసరా పండుగ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తులు ఫోటెత్తారు. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దుర్గమ్మ దర్శనానికి రెండు కిలోమీటర్లు భక్తులు బారులు తీరారు. కనక దుర్గమ్మ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం జరగనుంది. మరోపక్క, విజయవాడ దుర్గ గుడికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పీఎన్‌బీఎస్‌ బస్టాండ్‌, కుమ్మరిపాలెం వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కాలినడక ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement