చీటర్ వంశీకృష్ణతో ‘దేశం’ నేత దోస్తీ !


*వ్యూహాత్మకంగానే పోలీసులకు లొంగుబాటు

 *ఆస్తులపై నోరు మెదపని వంశీకృష్ణ

 *అరెస్టుకు రంగం సిద్ధం


 

సాక్షి, విజయవాడ : పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నార్ల వంశీకృష్ణ ప్రజలను మో సం చేయడం వెనుక సెం ట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిసింది. బిల్డర్‌గా ఎంతో గుర్తింపు ఉన్న ఈ నేత సల హాలు, సూచనలతోనే వంశీకృష్ణ  బిల్డర్‌గా మారి, తాడేపల్లి, నిడమానూరు తదితర ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కట్టేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది. పైగా సీఐ స్థాయి పోలీసు అధికారి అండదండలు అతడికి పుష్కలంగా ఉన్నాయి. దీంతో తాను నగరంలోని ఒక పారిశ్రామికవేత్త మేనల్లుడుగా అందరికీ పరిచయం చేసుకుంటూ మోసాలకు తెగబడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.నగరంలోని డాక్టర్‌తోనూ నార్ల వంశీకృష్ణకు పరిచయాలు పుష్కలంగా ఉన్నాయి. తన మాయమాటలతో ఎదుటివార్ని ఇట్టే బుట్టలో వేయడంతో వంశీకృష్ణ దిట్ట. దీనికి తోడు బిల్డర్, పోలీసు, డాక్టర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటూ పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తల వద్దనే లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి లక్షలు వెనకేసుకున్నాడని బాధితులు చెబుతున్నారు. బ్యాంకులో కలెక్షన్ ఏజెంటుగా పనిచేసిన అనుభవం ఉండటంతో బ్యాంకర్లను కూడా నమ్మించి, ఇళ్లకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తనఖాలు పెట్టి లక్షలు రుణాలుగా కూడా పొందాడని ఆరోపిస్తున్నారు.  

 

డబ్బంతా టీడీపీ నేత వద్దనేనా!?

 

తెలుగుదేశం పార్టీ నేత  వేసిన ప్రణాళిక ప్రకారమే వంశీకృష్ణ నడుచుకుని 2011 జనవరి నాలుగోతేదీన దుగ్గిరాల వద్ద కారు కాలువలో పడినట్లు హైడ్రామా నడిపాడని తెలుస్తోంది. కారును కూడా వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసి, దాన్ని కాలవలోకి తోసివేసి వంశీ మాయమయ్యాడు. ఆ తరువాత నగరంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు టీడీపీ నేత ద్వారానే తెలుసుకుంటున్నట్లు తెలి సిం ది. ఇదంతా జరిగి రెండేళ్లు దాటిపోవడంతో తనకు బకాయి లు ఇచ్చిన వారి ఆవేశం కూడా తగ్గుతుందని నిర్ధారించుకుని వ్యూహ్యాత్మంగా పోలీసులకు లొంగిపోయి హైడ్రామా సృష్టిస్తున్నాడు. ప్రజల్ని మోసం చేసిన వంశీకృష్ణ సంపాదించిన వందల కోట్ల ఆస్తులను కూడా టీడీపీ నేత బంధువులను బినామీలుగా మార్చి బదిలీ చేసినట్లు చెబుతున్నారు.

 

నోరు విప్పని వంశీకృష్ణకాగా గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నా.. వంశీకృష్ణ వాస్తవాలు వెల్లడించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని వారి వద్ద బు కాయిస్తున్నాడు. వంశీకృష్ణకు లక్షలు అప్పుగా ఇచ్చిన పోలీ సు అధికారులు కూడా ఉండటంతో తొలుత తమ సొ మ్మును రాబట్టుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు అనేక మోసాలు చేయడానికి సహకరించిన సీఐ తాను పెట్టుబడి పెట్టిన రూ. 2 కోట్లు తిరిగి వసూలు చేసుకున్న తరువాతనే వంశీకృష్ణ లొంగుబాబు వ్యూహాన్ని అమ లు చేశాడని చెబుతున్నారు.ఇప్పుడు కూడా వంశీకృష్ణ వద్ద ఉన్న సొమ్ముతో పోలీసు అధికారులకు ఉన్న బకాయిలు తీర్చాలని కోరుతున్నారు. పోలీసులకు బకాయి తీరిస్తే తమ గతి ఏమిటని ఇప్పటికే వంశీకృష్ణకు లక్షలు అప్పులు ఇచ్చిన పేద, మధ్య తరగతి ప్రజలు లోబోదిబోమంటున్నారు. ఒక వైపు పోలీసులు, మరొక వైపు రాజకీయ నాయకులే కొమ్ముకాసి వంశీకృష్ణ లాంటి చీటర్‌ను కాపాడి తమ కడు పు కొడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

 

నేడు అరెస్టు!?


 

వ్యూహాత్మకంగా పోలీసులకు చిక్కిన వంశీకృష్ణను శనివా రం అరెస్టు చూపించే అవకాశం ఉంది. గతంలో అతనితో ఉన్న పరిచయాల దృష్ట్యా నేరస్తులను ఇంటరాగేషన్ చేసే స్థాయిలో చేయకుండా కేవలం అతడు చెప్పిన సమాచారం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తరువాత మరొకసారి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

 

వంశీకి సహకరించిన వారు పేర్లు బయట పెట్టండి : బొండా ఉమా డిమాండ్

 

వంశీకృష్ణకు తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకుడు సహకరించారని ప్రచారం జోరుగా సాగటంతో అతని పేరు బయట పెట్టాలని పోలీసులను ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వారికి అండగా ఉండి పోరాడతానని ఉమా పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top