తిరుపతిలో రెచ్చిపోయిన టీడీపీ మైనింగ్‌ మాఫియా

TDP Mining Mafia Attacks Villagers In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో టీడీపీకి చెందిన గ్రానైట్‌ మాఫియా రెచ్చిపోయింది. తిరుపతి రూరల్‌ మండలం అడపారెడ్డి పల్లె వద్ద టీడీపీ నేత మేఘనాథనాయుడుకు చెందిన అక్రమ మైనింగ్‌ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేఘనాథనాయుడు తన అనుచరులతో గ్రామస్తులపై కత్తులతో దాడి చేయించాడు. ఈ దాడిలో సురేంద్రరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా టీడీపీ నేత అనుచరులు తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఎంఆర్‌పల్లి ఎస్‌ఐకు గాయాలయ్యాయి. అయితే తనపై దాడి జరిగనప్పటికీ.. ఎస్సై ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఇంటికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top