మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారనే అక్కసుతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు.
ఒంగోలు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారనే అక్కసుతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు. టంగుటూరులో ఆదివారం అర్ధరాత్రి టీడీపీ నేతలు ముస్లింల ఇళ్లపై దాడులుకు దిగి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్, బైక్లు ధ్వంసం చేశారు. దీంతో మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. ఆదివారం తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.