టీడీపీ నేతల బెదిరింపులకు భయపడొద్దు

TDP Leaders Join In YSRCP In YSR Kadapa - Sakshi

మైదుకూరు(చాపాడు): టీడీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని.. ప్రతి కార్యకర్తకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని.. భవిష్యత్తు మన పార్టీదేనని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎ మ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిలు పేర్కొన్నారు. మై దుకూరు పట్టణంలోని 14 వార్డు మూలబాటకు చెం దిన టీడీపీ నాయకులు బ్యాటరీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో 100 కుటుంబాలు, 8వ వార్డుకు చెందిన పల్లపోతుల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 80 కుటుంబా లు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మాట్లాడుతూ నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లించని, ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో చేరిన వారిని బెదిరించటం, భయపెట్టడం లాంటివి మానుకోవాలని, బ్లాక్‌మేల్‌ రాజకీయాలు చేస్తే  ఊరుకోమన్నారు. కడప మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్కరికైనా ఇంటి స్థలం మంజూరు చేశారా, పింఛన్‌ ఇచ్చారా,  రోడ్డు వేశారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, పట్టణ అధ్యక్షులు కేపీ లింగన్న, చాపాడు ఎంపీపీ నరసింహారెడ్డి, నాయకులు లక్షుమయ్య, కానాల జయచంద్రారెడ్డి, గోశెట్టి లక్షుమయ్య, సొక్కం శివ, దువ్వూరు జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top