వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడి

TDP Leaders Attacked YSRCP Activist on the Grounds That YSRCP Participated in The Campaign - Sakshi

సాక్షి, పెద్దచెప్పలి (కమలాపురం) : వైఎస్సార్‌ సీపీ ప్రచా రంలో పాల్గొన్నాడనే కారణంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడి చేశారు. మండలంలోని పెద్దచెప్పలిలో గురువారం రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. కార్యక్రమం జరి గింది. ఇందులో పాల్గొన్నాడని పెద్దచెప్పలి ఇంది రమ్మ కాలనీకి చెందిన రాజాపై టీడీపీ నాయకులు నరసింహారెడ్డి, ఓబయ్య  దాడి చేశారు.బాధితుడు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం పెద్దచెప్పలి బస్టాండులో ఉండగా.. పని ఉందని, వెంటనే రావాలని టీడీపీ నాయకులు చెప్పగా రాజా వెళ్లా రు.

అతన్ని దాదిరెడ్డిపల్లెకు తీసుకెళ్లి కర్రలతో కొట్టి గాయపరిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి శుక్రవారం పెద్దచెప్పలికి చేరుకొని రాజాను పరా మర్శించారు. మీరు ఏమీ భయపడ వద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజాపై దాడి చేయడం హేయమని అన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇకపై తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తాము దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు.

బస్టాండులో ఉంటే తీసుకెళ్లారు
పెద్దచెప్పలి బస్టాండులో ఉంటే నరసింహారెడ్డి, ఓబయ్య రమ్మన్నారు. ఎదైనా పని ఉందేమోనని వెళ్లాను. వైఎస్సార్‌ సీపీ ప్రచారంలో తిరుగుతున్నానని తనను వారు కర్రలతో కొట్టి గాయపరిచారు.  
–రాజా, బాధితుడు, పెద్దచెప్పలి

తగిన భద్రత కల్పించాలి
ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేయడానికే టీడీపీ వారు దాడులకు తెగబడుతున్నారు. 2009లో కూడా ఇలాగే పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఘర్షణకు పాల్పడ్డారు.  ప్రస్తుతం  అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తగిన భద్రత కల్పించాలి.     
–చిన్నిరెడ్డి, పెద్దచెప్పలి, కమలాపురం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top