టీడీపీ నేత తనయుడు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది.
విజయవాడ: నగర టీడీపీ నేత నాగుల్ మీరా తనయుడు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వ్యభిచార గృహాలపై పోలీసులు చేసిన దాడిలో మీరా తనయుడు దొరికిపోయాడు. సత్యనారాయణపురంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నేత తనయుడు కూడా ఉండటం గమనార్హం.